UPDATES  

 వృక్షాలు మేలు చేసే నేస్తాలు

వృక్షాలు మేలు చేసే నేస్తాలు

ఎంఎన్ జిఓసి లో హరితహారం

మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ యన్. బలరాం,ఐ అర్ ఎస్

మన్యం న్యూస్ మణుగూరు:

తెలంగాణకు హరితహారంలో భాగంగా డైరెక్టర్  ఫైనాన్స్ ఎన్ బలరాం,ఐ‌ఆర్‌ఎస్ శనివారం నాడు మణుగూరు ఏరియాకు విచ్చేసి మణుగూరు ఓసి, ప్రాంతంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమములో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సభ కార్యక్రమంలో డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్ బలరాం, ఐ‌ఆర్‌ఎస్ మాట్లాడుతూ, భూమి యొక్క సమతుల్యాన్ని కాపాడడంలో అడవులు ముఖ్య భూమిక పోషిస్తాయి అన్నారు.జీవ కోటి మనుగడు కు నీరే ఆధారం అని,ప్రతి ఒక్కరం తమ వంతు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి అన్నారు. మన రాష్ట్రాన్ని ఆకు పచ్చ తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ కు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ధృడ సంకల్పంతో సింగరేణి యాజమాన్యం చైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్, ఐ‌ఏ‌ఎస్ ఖర్చుకు వెనుకాడకుండా లక్షలాది రూపాయిలు వెచ్చించి మేలు రకమైన మొక్కలను కొనుగోలు చేసి అన్నీ ఏరియాలలో లక్ష లాదిగా మొక్కలు నాటలని ఇచ్చిన ఆదేశం మేరకు అన్నీ ఏరియాలతో పాటు మణుగూరు ఏరియా లోను నూటికి నూరు శాతం మొక్కలు నాటడం,వాటిని పరిరక్షించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది అని తెలిపారు.వృక్షాలను ఎంతగా పెంచుతే అవి అంతగా మేలు చేసే నేస్తాలు కాబట్టి మనం, మన కుటుంబం,మన సమాజం పచ్చదనంతో కళకళ లాడుతూ ఆరోగ్యాన్ని,ఆహ్లాదాన్ని పంచే వన సంపదను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నను అక్కడ మొక్కలు నాటి హరిత వికాసానికి పాటుపడాలని సూచిస్తూ డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్ బలరాం,ఐ‌ఆర్‌ఎస్ ఎంతో ఉత్సాహంగా స్వయంగా 700 మొక్కలు నాటడం విశేషం. ఇప్పటి వరకు 16 వేల మొక్కలకు పైగా వివిధ ఏరియాలలో నాటడం వాటిలో 95 నుండి 100 శాతం మొక్కలు వృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు.అనంతరం ఏరియా జీఎం దుర్గం రామచందర్ మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో అన్నీ ఏరియాలతో పాటు మణుగూరు ఏరియాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్నారు.హరిత వికాసం పట్ల ఎంతో ఆసక్తిగా తమ స్వహస్తాలతో డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్ బలరాం,ఐ‌ఆర్‌ఎస్ వేలాది గా మొక్కలు నాటి మాకు కలిగించిన స్పూర్తితో మణుగూరు ప్రాంతం పచ్చదనంతో శోభిల్లటం గత మూడు సంవత్సరాల క్రితం డైరెక్టర్ మియావాకి పద్దతిన నాటిన మొక్కలు నేడు చక్కని చిట్టడివిని తలపింప చేయడం హరిత వికాసం చెందాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జి‌ఎం వీసం కృష్ణయ్య,ఏజిమ‌ఎం సివిల్ డి వెంకటేశ్వర్లు,ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి,పి‌ఓ –ఎం‌ఎన్‌జి‌ఓసి శ్రీనివాస చారి,పి‌ఓ –పి‌కే‌ఓసి టి లక్ష్మీపతి గౌడ్,డి‌జి‌ఎం పర్సనల్ ఎస్ రమేశ్,ప్రాజెక్ట్ ఇంజినీర్ రవీందర్,టి‌బి‌జి‌కే‌ఎస్ యూనియన్ నాయకులు వి ప్రభాకర్ రావు,ఇతర యూనియన్ నాయకులు, ఇతర అధికారులు,కాంట్రాక్ట్ కార్మికులు,తదితరులు పాల్గోన్నారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !