UPDATES  

 బీసీలకు 33 శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి

బీసీలకు 33 శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి

మహిళా బిల్లును ఆమోదించాలి

మణుగూరులో కధం తొక్కిన ప్రజా ప్రతినిధులు,మహిళ కార్యకర్తలు

మన్యం న్యూస్ మణుగూరు:

మహిళా బిల్లును ఆమోదించాలి అని,చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని మణుగూరులో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,మహిళా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా బిఅర్ఎస్ పార్టీ మహిళ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మాట్లాడుతూ, తరతరాలుగా కులవృత్తులను నిర్వహిస్తూ,దేశ సంపద సృష్టి లో కీలక భూమిక పోషిస్తున్న బీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని,ప్రస్తుతం పార్లమెంటులో మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు.మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుంది అని,ఓబీసీ లు, మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు పెట్టి ఆమోదించాలి అని వారు డిమాండ్ చేశారు.మహిళా సంక్షేమం,బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.దేశ వ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తునే ఉంటుందని పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మహిళ ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు.ఈ అంశాలను ఎంపీలు ఉభయ సభల్లో లేవనెత్తి చట్టసభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్,33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు రెండింటినీ పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అన్నారు.ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కెసీఆర్ లేఖ రాశారు అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు కామారెడ్డి శ్రీ లత,సుది రెడ్డి సులోచన, ఎంపీపీలు విజయ కుమారి, రేగా కాళిక,బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పాకాల రమాదేవి,చంద్రకళ,మహిళా కార్యకర్తలు దారవత్ రమ, శభాన,సుజాత,మున్ని,శ్యామల,శ్రీలత,నియోజకవర్గ మహిళా ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !