కిష్టాపురం పంచాయితీలో గడపగడపకు బీఆర్ఎస్
కేసిఆర్ సంక్షేమ పథకాల గురించి విస్తృత ప్రచారం
పథకాలను ఆచరణలో పెడుతున్న రేగాకు ధన్యవాదాలు చెబుతున్న ప్రజానీకం
మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ ప్రభుత్వం విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతూ గడపగడపకు బీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పినపాక మండలంలోని పలు పంచాయతీలలో ప్రతి గ్రామంలోని నివాసానికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. శనివారం నాడు మండల పరిధిలోని కిష్టాపురం పంచాయతీలో సర్పంచ్ సుతారి సుశీల ఆధ్వర్యంలో, ఎంపీటీసీ కాయం శేఖర్, అమరారం సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావుల సారధ్యంలో ఇంటింటికి బిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీలోని ప్రతి గడప సంతోషంగా ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా వారు పథకాల ముఖ్య ఉద్దేశాలు, ఫలితాల గురించి వివరించడం జరిగింది. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పథకాలను అమలు చేయడంలో తన వంతు ముఖ్యపాత్ర పోషించాడని ప్రజానీకం తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగాకాంతారావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మొగిలిపల్లి