UPDATES  

 కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

*కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మెచ్చా

*గ్రామాల్లో ఘన స్వాగతం పలికిన మహిళలు

*ఆత్మీయ పలకరింపులు

మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 16: అశ్వారావుపేట మండలంలో శనివారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు ముందుగా రెడ్డిగూడెం గ్రామంలో గంధం ముచ్చిరెడ్డి కుటుంబాన్ని, తిరుమలకుంట గ్రామంలో పానుగంటి ఆదిలక్ష్మి కుటుంబాన్ని, ఉసుర్లగూడెం గ్రామంలో ఉప్పల బాబురావు కుటుంబాన్ని, మమిల్లవారిగూడెం గ్రామంలో అల్లి కృష్ణయ్య కుటుంబాలను పరామర్శించారు. కొర్సాగుంపు గ్రామంలో పాము కాటుకు గురై మడివి వెంకటేష్ కుమార్తె మృతి చెందగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబాన్ని ఓదార్చారు.
150 కుటుంబాలు బీ ఆర్ ఎస్ లో చేరిక
ఆసుపాక గ్రామంలో సుమారు 150కుటుంబాలు ఎమ్మెల్యే మెచ్చా సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే మెచ్చా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అలాగే వారందరికీ అండగా ఉంటానని ఎలాంటి అవసరం ఉన్న తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. రెడ్డిగూడెం నుంచి ఆసుపాక గ్రామం వరుకు సుమారు 50 ద్విచక్రవాహనాలతో ర్యాలీగా ఎమ్మెల్యే మెచ్చా పర్యటించారు. గ్రామాల్లో మహిళలు ఎమ్మెల్యే మెచ్చాకి పూల దండలు వేస్తూ ప్రేమగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మండల నాయకలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కార్యకర్తలు, నాయుకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !