మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 16::
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పర్ణశాల ప్రాంతంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పేరుతో గణేష్ నిమజ్జనం అడ్డుకోవడం సరికాదని పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి అన్నారు. ఇంతవరకు పర్ణశాల ఘాటు వద్ద సీతమ్మ ప్రాజెక్టు పనులు 10% కూడా జరగలేదని అటువంటిది పర్ణశాల తరతరాల నుంచి చేసే నిమజ్జన కార్యక్రమం ఎలా ఆపుతారని మండిపడ్డారు . పర్ణశాల గోదావరి ఘాటు వద్ద నిమజ్జనం కోసం అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే నిమజ్జనం చేసి అనంతరం సీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతారని నిమజ్జన కార్యక్రమం పర్ణశాలలో నిషేధించడం వల్ల సుదూర ప్రాంతమైన భద్రాచలం వెళ్లి గణేష్ నిమజ్జనాన్ని చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని ఇప్పుడున్న రోడ్లు కూడా పూర్తిగా పాడైపోవడం వల్ల ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉందని కనుక అధికారులు స్పందించి పర్ణశాలలో గణేష్ నిమజ్జనం అనుమతులు మంజూరు చేయాలని సర్పంచ్ కోరారు.