UPDATES  

 సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల నిర్లక్షం విడనాడాలి

సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల నిర్లక్షం విడనాడాలి
కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలను తక్షణమే అమలుచేయాలి
ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ షావలి మన్యంన్యూస్,ఇల్లందు: సింగరేణి జెకె -5 ఓసి కాంట్రాక్టు కార్మికుల మస్టర్ అడ్డా వద్ద పిఎస్సిడబ్ల్యూయు, ఇప్ట్యూ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి ఒకే కుటుంబం ఒకేగమ్యం ఒకే లక్ష్యం నినాదం ప్రకారం కాంట్రాక్టు కార్మికులను ద్వితీయ పౌరులుగా సింగరేణిలో గుర్తించడం లేదన్నారు. బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 2013 నుండి కోల్ ఇండియాలో పెరుగుతునే ఉన్నాయి. కోల్ ఇండియా ఒప్పందం జరిగి నేటికీ పదేళ్ళవుతున్నా సింగరేణిలో మాత్రం అమలు జరగడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఐఎఫ్టియు ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈనెల 20 నుంచి డిపార్ట్మెంట్ స్థాయి నుంచి జిఎం ఆఫీస్, హెడ్ ఆఫీస్ ధర్నాలకు పిలుపులనిచ్చామని తెలిపారు. కార్మికులు తమ హక్కులను సాధించుకునేందుకు అందరూ ఐక్యంగా కలిసిరావాలని యాకూబ్ షావలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు మేకల శ్రీను, చారి, తరుణ్, లింగమూర్తి, జగదీష్, మేకల శ్రీనివాసబాబు, సింగ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !