ములకలపల్లి. మన్యం న్యూస్. సెప్టెంబర్ 16.మండల పరిధిలోని పొగళ్లపల్లిలో పశు వైద్య శిబిరాన్ని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాల మిత్రులు ఏర్పాటు చేసారు.ఈ శిబిరంలో స్థానిక పశువైద్యాధికారి పి.రామకృష్ణ మాట్లాడుతూ, పశువులకు గర్భకోశ వ్యాధులకు సంబంధించిన చికిత్స 45 పశువులకు,30 దూడలకు వైద్యం చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ రొంటి చెన్నయ్య, వెటర్నరీ అసిస్టెంట్ భూక్య బన్సీలాల్,ఓ.ఎస్ రామకృష్ణ గోపాలమిత్రులు
నరేష్,సతీష్, రాజేంద్రప్రసాద్ ,
పశుమిత్ర రాజు, పాడి రైతులు పాల్గొన్నారు.
