*చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వండి..
*మహిళా బిల్లును ఆమోదించండి.
మన్యం న్యూస్, బూర్గంపహాడ్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు బుర్గంపహాడ్ మండల జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,పినపాక నియోజకవర్గ మహిళా విభాగం ఆధ్వర్యంలో మణుగూరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మహిళ బిల్లును ఆమోదించాలని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టి బూర్గంపహాడ్ జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతు తరతరాలుగా కులవృత్తులను నిర్వహిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్న బీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉన్నదని,మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుందని,అందువల్ల ఓబీసీలు,మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు పెట్టి ఆమోదించాలని అన్నారు.బీసీ మహిళా బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ఎస్ పార్టీ మహిళ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ మహిళా సంక్షేమం,బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నదని,దేశవ్యా ప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపి స్తునే ఉంటుందని పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మహిళ ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు.ఈ అంశాలను ఎంపీలు ఉభయ సభల్లో లేవనెత్తి చట్టసభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్,33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు రెండింటినీ ఈ నెల 18 నుంచి నిర్వహించనున్న పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కేంద్రప్రభు త్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు లేఖ రాశారని. గట్టిగా పోరాడాలని దిశానిర్దేశం చేశారని ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రానిదే తరతరాలుగా కుల వృత్తులను నిర్వహిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్న బీసీలకు చట్ట సభల్లో సముచిత ప్రాధాన్యం కల్పించా ల్సిన అవసరం ఉన్నదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జడ్పిటిసిలు,ఎంపీటీసీలు,ఎంపీపీలు,సర్పంచులు,ఉపసర్పంచ్ లు,మండల కమిటీ నాయకులు,గ్రామ కమిటీ నాయకులు,మహిళా కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.