UPDATES  

 ఉచిత కరెంటు అందజేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు

ఉచిత కరెంటు అందజేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
జలగం జగదీష్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నాయిబ్రాహ్మణుల సంఘం.
ఉచిత
మన్యం న్యూస్, బూర్గంపహాడ్: బీఆర్ ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ ని శనివారం నాయిబ్రాహ్మణుల సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు అందజేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో తమ ఆర్థిక కష్టాలు తొలగిపోయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నామన్నారు. ఒకనాడు పూట గడవని దయానియస్థితిలో ఉన్న తమకు సీఎం కేసీఆర్ దేవుడయ్యారని కొనియాడారు. అనంతరం గృహలక్ష్మి పథకం కింద నాయి బ్రాహ్మణులకు ఇల్లు మంజూరు చేయాలని జలగం కి వినతి పత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ త్వరలోనే వారి న్యాయ సమ్మతమైన సమస్యను పినపాక ఎమ్మెల్యే రేగా దృష్టికి తీసుకు వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి పథకాలు అందే విధంగా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఉప్పెర్ల సీతారాములు,ప్రధాన కార్యదర్శి నరసింహారావు,వైస్ ప్రెసిడెంట్ నంద్యాల ఏడుకొండలు,కార్యదర్సి వల్లోజు శ్రీను,కోశాధికారి దడిగల నాగేశ్వరరావు,గౌరవ అధ్యక్షులు ఉప్పెర్ల అన్నారావు,ఆర్గనైజర్స్ రమణయ్య,నాగయ్య మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !