విలేకరి సోదరులు కొంపెల్లి చిన్న నాగేశ్వరరావు గౌడ్,కొంపెల్లి సంతోష్ గౌడ్ ని పరామర్శించిన నవీన్ బాబు
*కొంపెల్లి చిన్న లక్ష్మీ దశదినకర్మలకు రూ.5వేల నగదు,50 కేజీ ల బియ్యం వితరణ అందజేసిన నవీన్ బాబు
మన్యం న్యూస్ ,పినపాక: మండల పరిధి తోగ్గూడం పంచాయతీ గోపాలరావుపేట గ్రామానికి చెందిన కొంపెల్లి చిన్న లక్ష్మి అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచన మేరకు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుద్ధ రాజు నవీన్ బాబు శనివారం రాత్రి కొంపెల్లి లక్ష్మి కుటుంబ సభ్యులు, పినపాక మండలానికి చెందిన విలేకరి సోదరులు కొంపెల్లి చిన్న నాగేశ్వరరావు గౌడ్,కొంపెల్లి సంతోష్ గౌడ్ ని పరమర్శించారు. ఈ సందర్భంగా రూ 5వేల నగదు, 50 కేజీల బియ్యం వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తోగూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం, ఉప సర్పంచ్ బుసి శ్రీనివాసరావు, మన్యం న్యూస్ ఆర్ఎం కొత్త దామోదర్ గౌడ్,మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ, తమ్మిశెట్టి రఘు, సూర్య ,కొయ్యడా రాము, చిర్ర వెంకన్న గౌడ్ ,కొంపెల్లి మల్లేష్ గౌడ్, జలగం అశోక్ గౌడ్, చిర్ర కుమార్ గౌడ్, ఊడుగుల రామచంద్రు ,ఉమ ,బ్రహ్మము, నరేష్ తదితరులు పాల్గొన్నారు.