UPDATES  

 ముర్రేడు బ్రిడ్జిపై ఆందోళన

ముర్రేడు బ్రిడ్జిపై ఆందోళన
* బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని డిమాండ్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
రెండవ బ్రిడ్జి పనులను పూర్తి చేయడంలో జాతీయ రహదారుల శాఖ అధికారుల, గుత్తేదారు నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ముర్రేడు బ్రిడ్జిపై శనివారం శ్రీనగర్ కాలనీవాసులు శ్రీనగర్ కాలనీ ఉపసర్పంచ్ లగడపాటి రమేష్ చంద్, వార్డు సభ్యులు ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ పాష, లక్ష్మీదేవిపల్లి మండల రైతు సమన్వయ సమితి సభ్యులు వట్టికొండ సాంబశివరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి అధికారులను, గుత్తేదారునీ నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సుమారు ఏడు సంవత్సరాలుగా మొదలుపెట్టిన రెండో బ్రిడ్జి పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం సర్వీస్ రోడ్డు వేయకుండా మున్సిపాలిటీ నుంచి వచ్చే డ్రైనేజీ నీళ్ళని కాలువలు కట్టకుండా వదలడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బ్రిడ్జి పనులు అసంపూర్తిగా నిలిచిపోవడం వల్ల ఎంతో మంది ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాల పాలయ్యారని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని శ్రీనగర్ కాలనీ ఉపసర్పంచ్ లగడపాటి రమేష్ చంద్ వారిని ప్రశ్నించారు.
మొదట సర్వీస్ రోడ్డు డ్రైనేజీ నిర్మించిన తర్వాతే రెండవ బ్రిడ్జి నిర్మాణం పనులు చేయాలని అధికారులను కాంట్రాక్టర్ నిలదీయగా కాంట్రాక్టర్ లికిత పూర్వకంగా లెటర్ రాసి ఆదివారం నుండి పనులు మొదలు పెడతానని హామీ ఇవ్వగా ఆందోళన విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు మురళి, సురేష్, ప్రవీణ్, వీరా చారి, బ్రమ్మ చారి, గోవింద చారి, అప్పా రెడ్డి, వీర భద్రం నరసింహారావు, సత్యం, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !