నేడు కలెక్టరేట్ లో జాతీయ సమైక్యత దినోత్సవం
* ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ పియాంక అల తెలిపారు. 17వ తేదీన నిర్వహించనున్న జాతీయ తెలంగాణ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఐడిఓసి కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉదయం 8 గంటల వరకు ఐడిఓసి కార్యాలయానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.