సింగరేణి ఆస్తులను కాపాడడమే మీ లక్ష్యం
* సింగరేణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ బసవయ్య
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణి ఆస్తులను కాపాడడమే మీ లక్ష్యమని సింగరేణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ బసవయ్య సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు.
సింగరేణి కార్పొరేట్ ఆధ్వర్యంలో యస్ అండ్ పిసి ట్రైనింగ్ సెంటర్ లో జరిగిన 74వ బ్యాచ్ సెక్యూరిటీ గార్డుల పునఃశ్చరణ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి శనివారం సింగరేణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ కె.బసవయ్య
పాల్గొని మాట్లాడారు. శిక్షణ అనేది మెరుగైన వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వహించేందుకు అవసరమని అందరికీ అన్ని విషయాలు తెలియవని శిక్షణ ద్వారానే సరికొత్త విషయాలు తెలుసుకోగలుగుతామని తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలను విధులలో అన్వయిస్తూ సింగరేణి ఆస్తులను కంపెనీ భూములు క్వార్టర్లు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. నీతి నిజాయితీ నిబద్ధతతో విధులు నిర్వహించాలని తెలిపారు. జనరల్ మేనేజర్ (సెక్యూరిటీ)
బి.ఆర్.దీక్షితులు మాట్లాడుతూ సెక్యూరిటీ సిబ్బంది అందరికీ శిక్షణ ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం ఎంతో కృషి చేస్తూ యాజమాన్యం సెక్యూరిటీ సిబ్బంది కొరకు నూతన ట్రైనింగ్ సెంటర్ అన్ని అధునాతన సౌకర్యాలతో నిర్మించుటకు కృషి చేస్తుందని తెలిపారు. ట్రైనింగ్ సెంటర్ ద్వారా శిక్షణ పొంది అందరూ సింగరేణి అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
అనంతరం ఉత్తమ ట్రైనీలుగా ఎంపిక కాబడిన బి.శర్వన్, గులాం గౌస్, యం.సురేష్ కుమార్లకు బహుమతులు అందజేశారు. 74వ బ్యాచ్ సెక్యూరిటీ సిబ్బంది అందరూ శ్రీజ్యోతి అనాథ శరణాలయ నిర్వాహకులకు ముఖ్యఅతిథి
కె.బసవయ్య, జనరల్ మేనేజర్ చేతుల మీదుగా నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అధికారి యం.డి జాకీర్ హుస్సేన్, జె. వేణు మాధవ్ ఎస్వోటూ జియం(సెక్యూరిటీ) తదితరులు పాల్గొన్నారు.