UPDATES  

 ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

 

మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణకు అందరం పాటుపడదామని పిలుపునిచ్చారు. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. వినాయకుని ఆశీస్సులతో సకల విఘ్నాలు తొలగిపోవాలని అందరికీ శుభం కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాలలో యువత కూడా నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కాకుండా కలిసిమెలిసి సోదరభావంతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !