UPDATES  

 ఓటు మార్పు చేర్పులకు రేపటి వరకే అవకాశం * జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఆగస్టు 21వ తేదీన ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం చిరునామా మారిన ఓటర్లు మార్పులు, చేర్పులతో పాటు 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు నూతన ఓటరుగా నమోదు, ఏదేని అబ్యంతరాలు కొరకు దరఖాస్తు చేయుటకు ఈ నెల 19వ తేదీ చివరి తేదీ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఒక ప్రకటనలో తెలిపారు. చిరునామా మార్పు, నూతన ఓటరు నమోదుకు, మరణించిన ఓటర్లు తొలగింపుకు కుటుంబ సభ్యులకు ఫారం 7 ద్వారా నోటీస్ లు జారీ నిర్ణిత ఫారాలలో చేయాలని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందని ముసాయిదా ఓటరు ఓటరు జాబితాలో అభ్యంతరాలకు దరఖాస్తు చేయాలని చెప్పారు. 1.10.2023 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతి, యువకులు నూతన ఓటరు గా నమోదు కావాలని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !