స్వచ్ఛతా హి సేవ 2023 ఎస్సీ కాలనీలో నిర్వహించిన సర్పంచ్
శ్రమదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న ఎస్సీ కాలనీ యువత
మన్యం న్యూస్ ,అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గ్రామపంచాయతీలోని ఎస్సీ కాలనీ లో స్వచ్ఛతా హి సేవ – 2023 లో భాగంగా శ్రమదాన కార్యక్రమం సర్పంచ్ బానోత్ శారద ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీలోని వీధి వీధిలు శుభ్రం చేస్తూ, బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ, పిచ్చి మొక్కలను పీకి స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్, ఎంపీవో శ్రీనివాస్, పంచాయతీ సెక్రెటరీ కృష్ణ చైతన్య, చంద్రకళ, సదర్ లాల్,ఇసంపల్లి కృష్ణ, గద్దల రామకృష్ణ, గొల్లపల్లి జార్జి, గొల్లపల్లి నరేష్ కుమార్, జుట్టు సురేష్, చుంచు ప్రవీణ్, పంచాయతీ కార్మికుల, మరియు ఎస్సీ కాలనీ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.