UPDATES  

 బీసీ జనగణన జరగాల్సిందే చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలి

బీసీ జనగణన జరగాల్సిందే చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలి

పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి

ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
మన్యంన్యూస్,ఇల్లందు:చట్టసభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్, 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులను రెండింటిని ఈనెల 18వ తేదీ నుంచి నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటానికి మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ అధ్యక్షతన ఇల్లందు మున్సిపల్ పాలకవర్గ మహిళా కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు మహిళా కమిటీ వారి ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తొలుతగా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పట్టణ ప్రధానసెంటర్ల గుండా కొత్తబస్టాండ్ సెంటర్ వరకు బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి, కొమరం భీమ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాలులర్పించారు. ఈ మేరకు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మాట్లాడుతూ..పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్లు కేటాయించాలంటూ ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. ఈనెల 18 నుంచి జరగనున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళాబిల్లు తక్షణమే ప్రవేశపెట్టాలంటూ కార్యకర్తలతో కలిసి మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కొరకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నదని దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తుందని ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. మహిళాశక్తిని సరిగ్గా వినియోగించినప్పుడే ఏ సమాజమైన అభివృద్ధిపదంలో పయనిస్తుందని, రాష్ట్రంలో మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గుర్తుచేశారు. రాజకీయాల్లో కూడా మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తక్షణచర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ చట్టసభల్లో 33శాతం బీసీలకు, మహిళలకు రిజర్వేషన్ అమలయ్యేలా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళలపై వివక్ష పోవాలంటే చట్టసభల్లో వారికి 33శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, శీలం రమేష్, మహిళా ఉపాధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్, నియోజకవర్గ మహిళా సర్పంచులు, జెడ్పీటీసీలు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !