ఘనంగా విశ్వకర్మ భగవాన్ జయంతి*
మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో
వాస్తు శిల్పి సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు గుంతోజు శివకుమార చారి తాటికొండ శ్రీనివాస చారి జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు సత్య మోజు దేవేంద్ర చారి, గుంతోజు శ్రీనివాస చారి, వల్లాల నాగేశ్వర చారి, ఈశ్వరోజు సద్గుణ చారి ,గుంతోజు నవీన్ చారి ,ఎం సదానంద చారి ,సత్య మోజు మధుసూదనాచారి, వినోద్ శంకర భక్తుల హరిబాబు శంకర్ వీరభద్రా చారి ,కనకాచారి ,గుంతోజు మధుసూదనాచారి, ఈశ్వరోజు వెంకన్న, యుగంధర్, సత్య మోజు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
