మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 16::
మండల పరిధిలోని లచ్చిగూడెం గ్రామంలో గుంతలుగా ఉన్న బీటీ రోడ్డు మరమ్మతులు తక్షణమే చేపట్టాలని సిపిఎం శాఖ కార్యదర్శి పెనుబల్లి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామంలో సందర్శించిన ఆయన మాట్లాడుతూ బీటీ రోడ్డు నిర్మాణం చేసి ఏడు సంవత్సరాలు అవుతుందని గత వర్షాలకు రోడ్డు మొత్తం పాడైపోయిందని, ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే కి సమస్యపై పట్టింపులేదని అన్నారు. రోడ్డు ప్రమాదకరంగా ఉండడం వల్ల చిన్న పిల్లలకు గ్రామస్తులకు ప్రమాదాలలు గురై అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మధు ఎంపీటీసీ పెనుబల్లి సీతమ్మ ప్రసాద్ రమేష్ నాగమణి శంకర్ గ్రామస్తులు పాల్గొన్నారు