మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 17: అశ్వారావుపేట మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నందు గల కనకదుర్గ బుక్ స్టాల్ ఎదురుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మట్టి గణపతులని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దుపకుంట్ దుర్గారావు, యుఎస్ ప్రకాష్ రావు, కంచర్ల రమేష్, యు సుబ్రమణ్యం, జూపల్లి బ్రహ్మరావు, కోటగిరి మోహన్ రావు, చలపతి రావు, కంచర్ల సత్యనారాయణ, మద్దాల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.