మన్యం న్యూస్ కరకగూడెం: అంగన్ వాడి టీచర్లు,ఆయలు చేపట్టిన నిర్వర్ధిక సమ్మె ఆదివారంతో ఏడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ జేఏసీ జిల్లా చైర్మన్, ఐఎన్ టియుసి వైస్ ప్రెసిడెంట్ గొంది.వెంకటేశ్వర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్ వాడీ టీచర్లు,ఆయలు చేపట్టిన నిర్వర్ధిక సమ్మెకు మెడికల్ జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తూ జీఓ తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు శీలం. వీరస్వామి,అజ్మీర హనుమంత్ అంగన్ వాడి టీచర్లు,ఆయాలు పాల్గొన్నారు.
