మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ చైర్మన్ సామెల్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఆ సంఘం నాయకులు, సామెల్ అనుచరులు మంగళవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ సామెల్ పై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తమ నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ములకలపల్లికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయగానే కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండా కేసులు పెట్టడం సరైనది కాదన్నారు. పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ములకలపల్లి మండలంకు చెందిన ప్రజలు సామెల్ అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.