మన్యం న్యూస్,అశ్వాపురం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటన విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.ఎమ్మెల్యే రేగా నేడు మొండికుంట, మల్లెల మడుగు,రామచంద్రపురం పంచాయతీలలో పర్యటంచి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రేగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
