వన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
చదువుతోనే సామాజిక ప్రగతి సాధ్యమని
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కొత్తగూడెం ఆధ్వర్యంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కిన్నెరసాని లో జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగ పాల్గొన్న న్యాయమూర్తి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని గ్రామాల నుండి వచ్చి చదువుకునే పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డం కాకూడదని గొప్ప స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. చదువుతోనే సామాజిక ప్రగతి సాధ్యపడుతుందని సందర్భంగా తెలిపారు. క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. తామర పువ్వు కూడ మలీనం నుండే వికసిస్తుందని అలాగే పరిస్థితులు ఎలా ఉన్నా చదువులొ గొప్పగా రాణించాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని తమ యొక్క తల్లిదండ్రులు గురువులను గౌరవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్, మహిళా ప్రతినిధి మనోరమ, గేమింగ్ సెక్రటరీ పిట్టల రామారావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పురుషోత్తం రావు, డిప్యూటీ కౌన్సిల్ నిరంజన్ రావు, సి డబ్ల్యూ మేంబర్ అంబేద్కర్, అనుబ్రోలు రాంప్రసాదరావు,మహిళ న్యాయవాదులు జీకే అన్నపూర్ణ, గాదే సునంద న్యాయ సహాయకులు జ్యోతి విశ్వకర్మ, నాగ స్రవంతి, పాల్వంచ రూరల్ ఎస్సై, కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్, పారా లీగల్ వాలంటీర్ రాజమణి తదితరులు పాల్గొన్నారు.