మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలకు సెప్టెంబరు 20,21 వ తేదీలలో జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి క్రీడా ఎంపికలు జరుగునున్నట్లు మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. వీరస్వామి,జి.నాగశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై ప్రారంభిస్తారని వారు తెలిపారు.ఈ మండల స్థాయి క్రీడలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ సమావేశంలో ఆదివాసి ఉద్యోగ సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు పోలెబోయిన.అనీల్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.