UPDATES  

 నూతన హెచ్ఎం గా ఏ.వి.రామారావు బాధ్యతలు స్వీకరణ..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 19::
దుమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన ప్రధానోపాధ్యాయులుగా ఏ.వి.రామారావు నియమితులయ్యారు. గతంలో ఇన్చార్జిగా పనిచేస్తున్న అపక శంకర్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను గతంలో ఈ పాఠశాలలోనే మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులుగా పని చేసానని ప్రస్తుతం మరల పదోన్నతి పై హెచ్ఎం గా ఇదే పాఠశాలలో పనిచేయడం అలానే పదవి విరమణ పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు గ్రామస్తులు నూతన ప్రధానోపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి సభ్యులు ముసలి రాంబాబు, షేక్ హుస్సేన్ అహ్మద్, టీచర్లు శంకర్, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !