UPDATES  

 ఇక పల్లెల్లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు

ఇక పల్లెల్లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు
* వైద్య క్యాంపులు నిర్వహణకు షెడ్యూలు
* జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల వైద్యాధికారులకు ఆదేశం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రభుత్వం విద్య వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న దానిలో భాగంగా ఇక పల్లెల్లో మల్టీ స్పెషాలిటీ వైద్య క్యాంపులు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన మారుమూల ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటి వైద్య క్యాంపులు నిర్వహణకు షెడ్యూలు తయారు చేయాలని
జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం ఐటిడిఏ కార్యాలయంలో పిఓ
ప్రతీక్ జైన్తో కలిసి ఆర్డీఎస్ఆర్, గిరిజన విద్య గురుకుల గిరిజన ఇంజనీరింగ్ విభాగం అంగన్వాడి భవనాలు
సియం గిరి వికాసం యువజన శిక్షణా కార్యక్రమాలు జిసిసి వైద్య ఆరోగ్య శాఖ తదితర ఐటిడిఏ ద్వారా అమలు
జరుగుతున్న కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా శాఖల ద్వారా అమలు జరుగుతున్న పథకాలు ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ చర్యల్లో భాగంగా
వచ్చే వారం మల్టి స్పెషాల్టి వైద్య క్యాంపులు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రాలు నిర్వహణలో
ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు పాటించాల్సిన ఆరోగ్య నియయాలను వివరించాలని చెప్పారు. 102, 108 అంబులెన్సులు
వెళ్లడానికి రహదారి సౌకర్యం లేని గ్రామాల జాబితా అందచేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. మంచినీటి సౌకర్యం లేని పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల జాబితా అందచేయాలని చెప్పారు. ఐటిడిఏ ద్వారా నిర్వహిస్తున్న
పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని గిరిజన సంక్షేమ
శాఖ డిడిని ఆదేశించారు. అనంతరం ఐటిడిఏ ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. శిక్షణ
పొందుతున్న విద్యార్థులో ముఖాముఖి నిర్వహించారు. శిక్షణలో మెలకువలు నేర్చుకుని, ఉపాధి రంగంలో రాణించాలని
చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు.
ఈ సమావేశంలో డిఆర్డిఓ మధుసూదన్
రాజు, సహాకార అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, డిఈఓ వెంకటేశ్వరచారి, గిరిజన సంక్షేమ శాఖ డిడి మణెమ్మ, ఎస్ఓ సురేష్ తదితరులు
పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !