మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 19::
అంగన్వాడి ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని మరి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని దుమ్ముగూడెం రైతు సంఘం మండల అధ్యక్షులు బొల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని లక్ష్మీనరం గ్రామంలో అంగన్వాడి ఉద్యోగులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్లు, ఆయాలు న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడి టీచర్లు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరైనది కాదని వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు కమలాదేవి కృష్ణవేణి నరసమ్మ అంజలి పద్మ తదితరులు పాల్గొన్నారు