మన్యం న్యూస్ ,బూర్గంపహాడ్: బీఆర్ఎస్ పార్టీ మండలయూత్ అధ్యక్షులు గోనెల నాని గత కొద్దిరోజులుగా వైరల్ జ్వరంతో భద్రాచలంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొంది మంగళవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వారి నివాసంకి చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న ప్యాక్స్ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాస్, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీ బూర్గంపహడ్ మండల కేంద్రంలోని నాని నివాసానికి వెళ్లి పరామర్శించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి తోకల సతీష్ బిఆర్ఎస్ యువ నాయకులు పాల్గొన్నారు.
