UPDATES  

 సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగేనా?

సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగేనా?
* అనుమానమే అంటున్న కార్మిక సంఘాలు
* అక్టోబర్ 28న ఎన్నికలు జరిపేందుకు తీర్మానం చేసిన నమ్మకం లేదంటున్న నేతలు
* ఈనెల 22న మరోసారి హైదరాబాదులో చర్చలు
* గుర్తింపు ఎన్నికల నగారాపై ఉత్కంఠ

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణిలో ఎట్టకేలకు గుర్తింపు సంఘం ఎన్నికల జరపాలని ముహూర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసింది. ఈనెల 11వ తేదీన హైదరాబాదులోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులకు సింగరేణి యాజమాన్యం మధ్య చర్చలు జరగడం జరిగింది. ఈ చర్చలో అక్టోబర్ 28వ తేదీన ఎన్నికల జర్పాలని తీర్మానం చేశారు. అంతేకాకుండా ఎన్నికల షెడ్యూల్ సంబంధించిన వివరాలను స్పష్టంగా తెలిపేందుకు మరోసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దాం అని అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈనెల 22వ తేదీన హైదరాబాదులోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో మరోసారి సమావేశం జరగనుంది. ఈ సమావేశం కూడా తాత్కాలికమే తప్ప ఎన్నికలు జరిగేందుకు చిత్తశుద్ధిని చూపించే అవకాశం ఏ కోశాన కనబడడం లేదని కొన్ని కార్మిక సంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరగకుండా వాయిదా వేసేందుకు మరోసారి చర్చల పేరుతో సమావేశం ఏర్పాటు చేసినట్లు పలువురు కార్మిక నేతలు పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడడంతో దీనిని బూచిగా చూపి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం లేకపోలేదని కొందరు కార్మిక సంఘాల నేతలు బహిరంగంగానే మాట్లాడుకోవడం పట్ల ప్రధాన కోల్డ్ బెల్ట్ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎన్నికలు జరపాలని యాజమాన్యంకు సరైన చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో జరిగేవని కార్మిక నేతలు గుసగుసలాడుకుంటున్నారు. సరిగ్గా ఆరేళ్ళ తరువాత సింగరేణిలో ఎన్నికలు జరగబోతున్నాయని సంబరపడిన కార్మికులు కార్మిక సంఘాల నేతలకు ఉత్సాహాన్నిస్తుందా నిరుత్సాహాన్నిస్తుందా అని పలువురు మాట్లాడుకోవడం గమనించాల్సిన విషయం.
సింగరేణి కాలరీస్ కంపెనీలో ఇప్పటివరకు జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఇప్పటికే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) మూడుసార్లు, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్(ఐ ఎన్ టి యు సి) ఒక్కసారి, తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రెండుసార్లు గెలిచి అధికారాన్ని చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. మొత్తము ఆరుసార్లు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగడం జరిగింది. ఈసారి జరిగితే ఏడోసారి గుర్తింపు ఎన్నికల్లో ఏ యూనియన్ గెలుస్తుందో వేచి చూడాల్సిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !