మన్యం న్యూస్,బూర్గంపాడు:
మండల పరిధి
బూర్గంపహడ్ గ్రామ పంచయతీలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతరావు కృషితో బూర్గంపహడ్ గ్రామ పంచాయతీలో మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణం కొరకు రూ.50లక్షలు మంజూరయ్యాయి. బూర్గంపహడ్ పంచాయతీ 8వ వార్డులో గల సీసీ
రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం గ్రామ పంచాయతీ సర్పంచ్ సిరిపురం స్వప్న కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తమ కష్టాలను తీర్చిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి మరువలేనిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రసిడెంట్ గోనెల నాని,వార్డు మెంబర్లు తోకల సుమతి,సొకత్ అలి బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తోకల సతీష్ తో పాటు గ్రామ పెద్దలు గొనెల నర్సింహారావు,నడికొప్పుల రాములు,తోకల వెంకన్న,ఘని యువ నాయకులు మందా ప్రసాద్,గుండె సతీష్,తోకల సాయి,ప్రశాంత్,సతీష్,సందీప్,ప్రసాద్,జంపన్న పాల్గొన్నారు.
