UPDATES  

 చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అఖిలపక్ష ర్యాలీ..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 19::చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అఖిలపక్ష ర్యాలీ..
*ర్యాలీలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య
మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 19:
మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. దుమ్ముగూడెం మండల అధ్యక్షులు కొమరం దామోదర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు పోదేం వీరయ్య మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నరసాపురం గ్రామంలో నిర్వహించిన సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ఖండించారు. బేసరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొడాలి శ్రీనివాస్, పాతూరి ప్రసాద్, ఎలమంచి వంశి, లంక అబుల్, వినీల్, బొల్లోలి వేణు, అన్నెం సత్యాలు, కొడాలి లోకేష్, సంగీతరావు, వాగే వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !