మన్యం న్యూస్,ఇల్లందు:భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ నాయకులు, బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి, జేబిసిసిఐ సభ్యులు ఆశీష్ మూర్తిలను సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా కేంద్రప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయటం పట్ల బీఎంఎస్ ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు నాయని సైదులు హర్షం వ్యక్తంచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బొగ్గుగని కార్మికులకు మెరుగైన చారిత్రాత్మకమైన ఒప్పందం 19శాతం మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్, 5శాతం కోల్డ్ ఫీల్డ్ అలవెన్స్, 23నెలల 11వ వేజ్ బోర్డ్ ఏరియర్స్ సాధించుటలో వ్యూహాత్మకమైన కీలకభూమిక పోషించిన కొత్తకాపు లక్ష్మారెడ్డి, ఆశీష్ మూర్తిలకు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ సింగరేణి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎంఎస్ పక్షాన ఎన్నో సంస్కరణల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారు బొగ్గుగని కార్మికులకు సీఎంపీఎఫ్ విషయంలో పూర్తిన్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
