మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 19: మండల పరిధి పేరాయిగూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్ నార్లపాటి సుమతి ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశుభ్రంగా లేనటువంటి వాతావరణంలో పరిశుభ్రం చేయడం, పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పేరాయిగూడెం పంచాయతీ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణ విధానం పై ఒక గంట పాటు బోధించడం, విద్యార్థులు, యువకులచే స్వచ్ఛ ప్రతిజ్ఞలు, ర్యాలీలు, మానవ హరం, స్వచ్ఛ నడక పరుగు గురించి చెప్పండి జరిగింది. వీధిలు శుభ్రం చేస్తూ, పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతలో స్కూల్ పిల్లలతో నా వంతు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాసరావు,పంచాయతీసెక్రటరీ శ్రీరామ్ మూర్తి, పంచాయతీ వర్కర్స్, స్కూల్ టీచర్ తదితరులు పాల్గొన్నారు.