UPDATES  

 ఆమ్ బజార్లో పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్

  • ఆమ్ బజార్లో పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్
  • బట్టల షాపులోకి చేరిన పైపులైన్ నీరు
  • తక్షణమే సమస్య ను పరిష్కరించిన ఎమ్మెల్యే హరిప్రియ
  • మన్యం న్యూస్,ఇల్లందు: ఇల్లందు నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా త్వరితగతిన పరిష్కరిస్తున్నారు. పట్టణంలోని ఆమ్ బజార్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయి రోడ్లన్నీ నీటితో నిండిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వాటర్ లీకేజీ ప్రాంతాన్నిసోమవారం సందర్శించారు. 48 అంగుళాల తాగునీటి పైపు లైన్ నుండి ప్రవాహంగా వచ్చిన నీరు బట్టల షాపులోకి వెళ్ళింది.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మరమత్తుల కోసం మిషన్ భగీరథ ఎస్ఈతో మాట్లాడి త్వరతగతిన పైప్ లైన్ మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులు మంగళవారం మధ్యాహ్నం వరకు మరమ్మతులు పూర్తిచేస్తామని ఎమ్మెల్యేకు విన్నవించడం జరిగింది. కాగా గతంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆమ్ బజార్లో వేయించిన డ్రైనేజీ నేడు ఆ ప్రాంతవాసులను ఆదుకుంది. పగిలిన పైప్ లైన్ నుంచి నీరు ప్రవాహంగా వస్తు డ్రైనేజీలోకి వెళ్లడంతో ఆ ప్రాంతంలోని షాపుల యజమానులకు చాలావరకు ప్రమాదం, ఇబ్బందులు తొలిగినట్లైంది. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా పైప్ లైన్ నుండి చిమ్ముతున్న నీరు డ్రైనేజీలో కలిసిపోవడంతో స్థానికవాసులు, వ్యాపారులు ఊపిరిపీల్చుకుంటూ ఆనాడు ముందుచూపుతో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చేసిన పనిని గుర్తు తెచ్చుకొని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీపాషా, పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్కె జానీ, బిఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ పాబోలు స్వాతికిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, మండల కోఆప్షన్ సభ్యులు ఘాజీ, పట్టణ ప్రచార కార్యదర్శి, సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !