మన్యం న్యూస్, మంగపేట:
మంగపేట మండల కేంద్రం లో
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు జాడి యుగేందర్ అధ్యక్షత న సోమవారం సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి మాట్లాడుతూ మండలంలో కొంతమంది ఉపాధ్యాయులు పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యాబోధన చెప్పకుండా పవిత్ర మైన పాఠశాలకు మద్యం మత్తులో విద్యాబోధన చేయడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు మద్యం మత్తులో వచ్చే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాలలకు తాగి వస్తున్న ఉపాధ్యాయుపై జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వి సిద్దు, జిల్లా కమిటీ సభ్యులు రవితేజ, బాలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
