UPDATES  

 ఓటరు నమోదు, సీజనల్ వ్యాధులపై కళాజాత * సాంస్కృతిక సారధి కళాకారుల చే ప్రదర్శన

మన్యం న్యూస్, మంగపేట:
జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ ఆదేశాల మేరకు మంగపేట మండలంలోని నరసింహసాగర్ ,మల్లూరు, తిమ్మంపేట గ్రామాల్లో సోమవారం తెలంగాణ సాంస్కృతిక సారధి ‘రాగుల శంకర్ బృందం’ చేతసీజనల్ వ్యాధులు, ఓటర్ నమోదుపై కళాజాత చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాల నుండిన యువతీ యువకులు ఓటురు నమోదు చేసుకోవాలని, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరు సద్వినియోగం చేసుకోవాలని కళాకారులు అవగాహన కల్పించారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆటపాటలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విలేజ్ స్పెషల్ ఆఫీసర్లు రూప్ సింగ్, దివ్య ప్రియ తో పాటు, కళాకారులు మార్త రవి ,గోల్కొండ బుచ్చన్న, ఈర్ల సాగర్, కనకం రాజేందర్, రేలా విజయ్, అమ్మపాట తిరుపతి, రేలా కుమార్, ఉండ్రతి భాస్కర్, గోల్కొండ నరేష్, గౌరారపు రాజు,కామెర దీపక్, మొగిలిచర్ల రాము, శోభ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !