UPDATES  

 రేపే చీకటి సూర్యులకు ఏరియర్స్ చెల్లింపు

రేపే చీకటి సూర్యులకు ఏరియర్స్ చెల్లింపు
* సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా రూ.1726 కోట్లు పంపిణీ
* నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు
* దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి
* ఖుషి ఖుషీగా కార్మిక కుటుంబాలు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణి కార్మికులకు వేతన బకాయిలను చెల్లింపుకు సింగరేణి యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 21వ తేదీన సింగరేణి వ్యాప్తంగా చీకటి సూర్యులకు, ఉద్యోగులకు రూ.1726 కోట్లు చెల్లించేందుకు చర్యలు చేపట్టి అంతా సిద్ధం చేసింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలో సింగరేణి గనులు విస్తరించి ఉండగా 11ఏరియాలు ఉన్నాయి. సింగరేణి సంస్థలో 40 వేలకు పైగా కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా కాటగిరి వైజ్ గా 11వ వేతన బకాయిలు తీసుకోనున్నారు. ఒక్కో కార్మికుడు ఉద్యోగి క్యాటగిరి పద్ధతిలో లక్ష రూపాయల నుంచి 5 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలో నేరుగా బకాయిలు జమ చేసేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు పూర్తి చేసింది. 10వ వేజ్ బోర్డు కాల పరిమితి 2021 జులై01 తో ముగిసిన విషయం విధితమే. తర్వాత 11వ వేజ్ బోర్డు అమల్లోకి రావడం జరిగింది. అయితే 2021 జూలై నుంచి 2023 మే 31 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలు పెండింగ్లో ఉండడం వల్ల పలు సింగరేణి కార్మిక సంఘాలు అట్టి బకాయిలను వెంటనే చెల్లించాలని పట్టుబట్టడంతో యాజమాన్యం దిగి వచ్చి మొత్తం 22 నెలలకు సంబంధించిన వేతన బకాయిలను గురువారం కార్మికులు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలలో సింగరేణి యాజమాన్యం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో ధన సిరులు వస్తుండడంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
డబ్బులను దుర్వినియోగం చేసుకోవద్దు..
సింగరేణి కార్మికుల ఉద్యోగులకు వేతన బకాయిల డబ్బులను సింగరేణి సంస్థ చెల్లిస్తున్న నేపథ్యంలో డబ్బులను దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. కార్మికులు తమ తమ కష్టాజితాన్ని భద్రపరచుకొని పిల్లల భవిష్యత్తు కోసం, అత్యవసరాల కోసం ఉపయోగించుకోవాలని యాజమాన్యం పేర్కొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !