అంగన్వాడి టీచర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
మన్యం న్యూస్ గుండాల: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ప్రజాపంథా రాష్ట్రనాయకులు గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్ చేస్తున్న నిరవేదిక సమ్మెకు ఆయన మద్దతు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. వారి పోరాటానికి మద్దతుగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరించేంతవరకు సంఘీభావం తెలుపుతామని అన్నారు. అంగన్వాడి టీచర్లకు 26వేల కనీస వేతనం ఇవ్వాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది గోవర్ధన్, రిటైర్డ్ అధికారి శర్మ, ప్రజాపంథా నాయకులు శంకర్, వాంకుడోత్ అజయ్, వెంకన్న, మండల కార్యదర్శి కొమరం శాంతయ్య, సనప కుమార్, మంగయ్య, నాయకులు కోడూరి జగన్, సింగన్న తదితరులు పాల్గొన్నారు.
