కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే ఆరు కష్టాలు గ్యారంటీ :ఎమ్మెల్యే రేగా
అభివృద్ధి ప్రధాతతోనే మా అడుగులు.
బూర్గంపహాడ్ మండలం నుండి జోరుగా బీ ఆర్ ఎస్ లోకి వలసలు.
సారపాక పట్టణ నుంచి బిఆర్ఎస్ పార్టీలో యువత చేరికల.
మన్యం న్యూస్ బూర్గంపహాడ్:-కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే ఆరు కష్టాలు గ్యారంటీ అని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు. బూర్గంపహాడ్ మండల పరిధిలోని పలు పార్టీలకు చెందిన నాయకులు బీ ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.బుధవారం సారపాక పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు,మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ ఖాదర్,మండల మైనార్టీ జనరల్ సెక్రెటరీ గుల్ మహ్మద్ వీరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పట్టనంలోని పలువురు నాయకులు యువత సహా పలు పార్టీల నుంచి 60 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా వారికి ప్రజాప్రతినిధులు,నాయకులతో కలిసి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ రేగా కాంతరావు పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ల్ బూర్గంపహాడ్ జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణా రెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,బూర్గంపహాడ్ సొసైటీ చైర్మెన్ బిక్కసాని శ్రీనివాసరావు,బిఆర్ఎస్ పార్టీ సారపాక పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీను,నియోజకవర్గ పరిశీలక నాయకులు మెడగం లక్ష్మినారాయణ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు,పార్టీ కార్యకర్తలు మహిళ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.