UPDATES  

 గుండాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి

గుండాల నీతి ఆయోగ్ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల
మన్యం న్యూస్ గుండాల: గుండాల మండలం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులకు సూచించారు. బుధవారం గుండాల మండలం పరిధిలోని వేపల గడ్డ గ్రామ సమీపంలో గల రైతు వేదికలో నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నీతి ఆయోగ్ యాక్సిరేషన్ బ్లాక్ గా గుండాల ఎంపిక కావడంతో మండల అభివృద్ధికి గ్రామస్థాయిలో చింతల్ సివిల్ కార్యాచరణ నివేదిక తయారుచేసి పంపాలని ఆమె సూచించారు. ఇంత సివిల్ (గ్రామసభలు) నిర్వహించి ప్రజల నుండి వినతులను సేకరించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. గ్రామస్థాయిలో గుర్తించిన సమస్యలతో తోపాటు ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై కూడా దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. 39 అంశాలతో నివేదికలు రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు. మొత్తం నీతి ఆయోగ్ పారామీటర్ పై తయారుచేసిన 25 నివేదికలను రూపొందించి యాక్సిరేషన్ బ్లాక్ లో అప్లోడ్ చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు ముఖ్యంగా ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు మౌలిక వసతుల కల్పన కోసం అన్ని వర్గాల ప్రజలను భాగ్య సామాన్లు చేసి అపరాధింపుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె సూచించారు. ఒక గ్రామానికి ఒక్కొక్క గ్రూపును ఏర్పాటు చేసి మొత్తం తొమ్మిది గ్రూపులను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. మొత్తం గుండాల మండల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు అయితే అభివృద్ధి వాటన్నిటిని సిద్ధం చేసి పంపాలని అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ మధుసూదన్ రాజు, జడ్పీ సీఈవో విద్యాలత, పి పి ఓ శ్రీనివాసరావు, జడ్పిటిసి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతారాములు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !