మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని కూనవరం పంచాయతీ సర్పంచ్ ఏనిక.ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం పంచాయతీ పరిధి లోని ప్రభుత్వ పాఠశాలలో, కార్యాలయ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా కార్యాలయాలు,పాఠశాలల పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఏనిక.ప్రసాద్ మాట్లాడుతూ,విద్యార్థులు తమ పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు.అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ నివాస ప్రాంతాలతో పాటు,తామ పరిశుభ్రతను,పాటించాలన్నారు.అనంతరం విద్యార్థులకు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం పట్ల అవగాహన కలిగించేందుకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు.ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.అనంతరం ఎంపీఓ వెంకటేశ్వర్లు,సర్పంచ్ ఏనిక.ప్రసాద్,కార్యదర్శి సంధ్యారాణి లతో కలిసి కూనవరం హెల్త్ సబ్ సెంటర్ ను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ లింగ్యా నాయక్, హెల్త్ అసిస్టెంట్ ఉమేష్, ఏఎన్ఎంలు లక్ష్మి,ఇందిరా,ఆశా వర్కర్లు నర్సులమ్మ,గంగాల విజయ,పాఠశాల హెచ్ఎం లోకేష్,ఉపాధ్యాయులు సింగా రవిబాబు,వీరు నాయక్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.