UPDATES  

 చిమ్మచీకట్లో ప్రకాశం స్టేడియం: కామేష్

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: కోట్ల రూపాయల లాభాలతో దూసుకుపోతున్న సింగరేణి సంస్థ పర్యవేక్షణలో ఉన్న ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో కనీస సౌకర్యాలు లేవని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు. బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ప్రకాశం సేయడం గ్రౌండ్లో కలియతిరిగారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన క్రీడాకారులు,వాకర్స్ తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కామేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో రంజి క్రికెట్ మ్యాచ్లు నిర్వహించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల లాభాలతో సింగరేణి సంస్థ దూసుకుపోతుందని తెలిపారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో క్రీడాకారులకు కనీస వసతులు ఏర్పాటు చేయడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సమావేశాలు సభలకు అనుమతులు ఇచ్చే యాజమాన్యం స్టేడియం గ్రౌండ్ చుట్టూ గుంతలు పేరుకుపోయి ఉన్నా వాటిని పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని అన్నారు. సాయంకాలం వేళల్లో వాకర్స్ క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకున్నందుకు గ్రౌండ్ కు విచ్చేస్తే కనీసం విద్యుత్ దీపాలు ఉన్నా వాటిని వెలిగించడంలేదని ఆరోపించారు. గ్రౌండ్ చుట్టూ కలుపుమొక్కలు పేరుకుపోవడంతో విషసర్పాలు సైతం తిరుగుతున్నాయని అన్నారు. కార్మిక ప్రాంతమైన కొత్తగూడెంలో క్రీడాకారుల కోసం యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం భావ్యం కాదన్నారు. ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులకు కనీసం మంచినీటి సౌకర్యం సైతం లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు, సాయి, సందెలా సందీప్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !