మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ బార్ కౌన్సిల్ ది లా సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ కామన్వెల్త్ లాయర్స్ అసోసియేషన్ ల సహకారంతో న్యూ ఢిల్లీలోని విగ్యాన్ భవన్ లో ఈ నెల 23, 24 తేదీల్లో జరగనున్న “ఇంటర్నేషనల్ లా కాన్ఫరెన్స్” లో పాల్గొనేందుకు ప్రతినిధిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్ ఎంపికయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించే ఈ మహాసభల్లో భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డాక్టర్
డి.వై.చంద్రచూడ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రారంభోత్సవ వేడుకకు గౌరవ అతిథిగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా హాజరవుతారు.
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేస్తారు.
ఆయనతో పాటు కేంద్ర కార్మిక ఉపాధి పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భుపేందర్ యాదవ్ తో పాటు యునైటెడ్ కింగ్డం లార్డ్ ఛాన్సలర్తో పాటు భారతదేశ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా పాల్గొంటారు.