UPDATES  

 కష్టార్జితాన్ని పొదుపు చేసుకోండి

కష్టార్జితాన్ని పొదుపు చేసుకోండి
* సింగరేణి డైరెక్టర్లు
* ఎక్కువ మొత్తంలో ఏరియర్స్ తీసుకున్న ఉద్యోగులకు సన్మానం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు కార్మికులు గురువారం ఏరియర్స్ అందుకోవడంతో వారిలో సంతోషం అవధులు లేకుండా పోయింది. 11వ వేజ్ బోర్డు ఎరియ‌ర్స్ లో ఎక్కువ అందుకున్న కార్పొరేట్ ఏరియా ఉద్యోగులకు సింగరేణి డైరక్టర్స్ ఆపరేషన్స్ ఎన్.వి.కే.శ్రీనివాస్, డైరక్టర్(ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణరావులు చెక్కులను అందజేయడం జరిగింది. సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.
సింగరేణి కార్మికులకు ఈ రోజు 11వ వేజ్ బోర్డు ఎరియ‌ర్స్ ను సంస్థ ఛైర్మన్ అండ్ డైరక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు డైరక్టర్ పర్సనల్ ఎన్.బలరామ్ కృషితో ఒకే సారి 1450 కోట్లు చెల్లిచటం చాలా సంతోషం అని తెలిపారు. ఈ ఎరియ‌ర్స్ ను చెల్లిచటంలో అత్యంత త్వరతగతిన ఎటువంటి తప్పులు లేకుండా చెల్లిచేందుకు ఎంతో విశేష కృషి చేసిన పర్సనల్ ఫైనాన్స్ ఆడిట్ ఈ‌ఆర్‌పి స్టాప్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. అదే విధంగా ఎన్‌సి‌డబల్యూ‌ఏ- 11 వేజ్ ఏరియర్స్ పొందబోతున్న పెద్ద మొత్తాన్ని ఉద్యోగులు వివిధ రకాలైనటువంటి జాతీయ ప్రభుత్వ పొదుపు పథకాలలో జమ చేసుకొని తద్వారా వచ్చే ఫలితాలని సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు.
అనంతరం 11వ వేజ్ బోర్డు ఎరియ‌ర్స్ లో ఎక్కువ మొత్తం అందుకున్న కార్పొరేట్ పరిధి లోని ఉద్యోగులయిన వై.పద్మజారాణి,
పి.నాగలక్ష్మి, ఎం.అబ్దుల్ అంజాద్ లకు చెక్కులను అందజేసి వారిని శాలువా పుష్ప గుచ్చంతో ఘనముగా సన్మానించారు.
ఈ కార్యక్రమములో సింగరేణి డైరక్టర్స్ ఆపరేషన్స్ ఎన్.వి.కే.శ్రీనివాస్, డైరక్టర్(ఈ అండ్ఎం)డి.సత్యనారాయణరావుతో పాటు జి‌ఎం(ఈ అండ్ ఎం) ఎన్.దామోదరరావు, పర్సనల్స్ బి.హనుమంతరావు, కవితా నాయుడు, ఎస్‌ఓ టు డైరక్టర్ పి‌పి జి.నాగేశ్వర రావు, జి‌ఎం ఫైనాన్స్ ఎం.సుబ్బారావు, సి‌ఎం‌ఓ పి.సుజాత, కార్పొరేట్ సి‌ఎం‌ఓ‌ఏ‌ఐ ప్రెసిడెంట్ ఎం.విజయ్ భాస్కర్ రెడ్డి, ఐటీ మేనేజర్ వేణుగోపాలరావు, ఎస్ఏపీహెచ్ఆర్ పర్సనల్ మేనేజర్ ఎస్ వెంకటేశ్వరరావు, ఈ‌ఆర్‌పి పి‌ఎం హర ప్రసాద్, అన్ని డిపార్ట్మెంట్ల జి‌ఎంలు, అన్ని యూనియన్ ల నాయకులు, అధికారులు, పి‌ఆర్‌పి పేరోల్ సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !