మన్యం న్యూస్ కరకగూడెం:అంగన్వాడీ టిచ్చర్లు,ఆయా ల కు కనీస వేతనం రూ.25వేలు ఇవ్వాలని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. మండల పరిధిలోని అంగన్వాడీ, అయాలు చెపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు.అనంతరం కరకగూడెం అంబేద్కర్ సెంటర్ నందు మానవహరం నిర్వహించి అంబేద్కర్ విగ్రహాన్ని కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి, సిఐటియూ మండల అధ్యక్షులు కొమరం.కాంతారావు,సిపిఐ మండల కార్యదర్శి వంగరి.సత్తిష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
