మన్యం న్యూస్ గుండాల: గుండాల మండల పాత్రికేయుడు తవిడిశెట్టి నాగరాజు మాతృమూర్తి దశదినకర్మకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ములుగు శాసనసభ్యులు సీతక్క హాజరయ్యారు. రాజలక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషాతో పాటు మండలానికి చెందిన వివిధ పార్టీ ల నాయకులు రాజ్యలక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యమాచారి, పార్టీ సీనియర్ నాయకులు ముత్తయ్య, ఎస్కే ఖదీర్, టిడిపి నాయకులు ఇల్లందుల అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
