సహకార బ్యాంకుల ద్వారానే రైతాంగానికి నిజమైన సాయం
రైతులకు చెక్కులు పంపిణీ చేసిన డీసీఎంఎస్ డైరెక్టర్ పరుచూరి
మన్యం న్యూస్ చర్ల :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లోని రైతులకు రుణమాఫీ, కొత్త సభ్యులకు రుణాలు మంజూరు కార్యక్రమంలో లబ్ధిదారులకు గురువారం స్థానిక కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో డీసీఎంఎస్ డైరెక్టర్, కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పరుచూరి రవికుమార్ రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. కొత్త సభ్యులు 60 మందికి 41 లక్షల50వేల రూపాయల విలువగల చెక్కులను సభ్యులకు ఇవ్వడం జరిగింది. అలాగేమూడవ విడత రుణమాఫీ కింద 126 మంది రైతులకు మాఫీ చేశారు. అనంతరం చైర్మన్ పరుచూరి రవికుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులను రాజులను చేయడానికి ముఖ్యమంత్రి అహర్నిశలూ కష్టపడుతున్నారని చెప్పారు. రైతుబంధు, రుణమాఫీ, విత్తనాలు, ఎరువులు, రైతుబీమా చివరకు రైతుల పంటల కొనుగోలు వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదన్నారు. మిగితా రాష్ర్టాల్లో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవుతున్నారని తక్కువ ధరలకే దళారులకు పంటలను అమ్ముకుంటున్నారని వివరించారు. ఈకార్యక్రమంలో డిసిసిబి మేనేజర్ రేణుక, అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ త్రిమూర్తులు, సీఈవో జిలాని, రైతులు పాల్గొన్నారు.