UPDATES  

 ములుగు నుండి వచ్చిన వ్యక్తి మాపై పెత్తనమా?

ములుగు నుండి వచ్చిన వ్యక్తి మాపై పెత్తనమా?
*కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసాం.
* మమ్ములను సస్పెండ్ చేయడం తగదు
* కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నాయకులు ఉబ్బ వేణు, తెల్లం నరేష్

మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 21::
భద్రాచలం నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విజయం కోసం అహర్నిశలు కష్టపడితే ఆ కారణంగా ఎటువంటి నోటీసులవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏంటని పార్టీ నాయకులు ఉబ్బ వేణు, తెల్లం నరేష్ మండిపడ్డారు. గురువారం మండలంలోని ములకాపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం 2009 లో దుమ్ముగూడెం పరిసర ప్రాంతాల్లో కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరు సాహసం చేయనటువంటి కాంగ్రెస్ జెండా పట్టుకుని పార్టీ కోసం నిరంతరంగా కృషి చేసి రెండుసార్లు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించామని అన్నారు. అలాంటి గుర్తింపుతో రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ విభాగ నాయకులుగా చలామణి అవుతున్నామని ఆదివాసి చట్టాలు హక్కుల పరిరక్షణ కోసం అనునిత్యం పోరాడుతూ ఎక్కడ కూడా పార్టీకి నష్టపరిచే విధంగా పార్టీ కి నష్టం చేయలేదని అన్నారు. గత ఎన్నికల్లో ములుగు నుంచి ఆఖరి నిమిషంలో వచ్చినటువంటి ఈ పెద్ద మనిషిని మా భుజాల మీద వేసుకొని గెలుపు కోసం అహర్నిశలు కష్టపడితే చివరకు మాకు ఇచ్చే ఫలితం ఇదేనా అంటూ ఆవేదన చెందారు. పార్టీలో మేము ఏ కోణంలోనైనా పార్టీ నష్టపరిచిన కనీసం మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ఏంటని, ఒక ఆదివాసి బిడ్డ అయ్యుండి సాటి ఆదివాసి బిడ్డలుగా ఉన్న మమ్మల్ని ఇలా పార్టీ నుండి దూరం చేయాలనే ఆలోచన రావడం బాధించినట్లు తెలిపారు. త్వరలోనే పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి కలిసి ఈ వ్యవహారంపై వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కనితి సమ్మయ్య, ఉబ్బ సంపత్, జీవన్, చినబాబు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !