అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం
మౌలిక వసతుల కల్పనలో కెసిఆర్ కు సాటి మరెవ్వరు
అన్ని రంగాలను ప్రగతి పదంలో నిలుపుతున్నాం ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ గుండాల: సర్కారు బడులను సమస్యల వలయం నుండి సౌకర్యాల నిలయముగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం గుండాల,ఆళ్లపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని రేగా కాంతారావు పేర్కొన్నారు. కాచన పల్లి పంచాయతీలోని జగ్గు తండా ప్రభుత్వ పాఠశాలను మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా 17 లక్షల రూపాయలతో అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దామని అన్నారు గతంలో ప్రభుత్వ పాఠశాల అంటేనే పిల్లలతోపాటు తల్లిదండ్రులు సైతం ఇష్టం చూపని తరుణం నుండి నేడు ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా తయారయ్యాయని అదే వారు అనే విధంగా ప్రభుత్వం తీర్చిదిద్దిందన్నారు. ఆళ్లపల్లి మండలంలోని లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలను మన ఊరు మనబడి నిధుల కింద ఆధునికరించబడ్డ పాఠశాలలను ఆయన అ
